ఆహా క్రిస్మస్ – Aha christmas lyrics The Ultimate Christmas Medley
ఆహా క్రిస్మస్ – Aha christmas lyrics The Ultimate Christmas Medley
1. రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ
రక్షకుండుదయించినాడట
రక్షకుండుదయించినాడు – రారే గొల్ల బోయలార
తక్షనమున బోయి మన ని- రీక్షణ ఫల మొందుదాము
రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ
రక్షకుండుదయించినాడట …
2. కన్య గర్భమందు – నీవు పుట్టావయ్యా
పరిశుద్దునిగా నీవు – మా కొరకు వచ్చావయ్యా
పశుల పాకలో – పశుల తొట్టెలో
పసి బాలుడిగా – ఉన్నావయ్యా …
3. ఓ ఓ ఓ ఓ ఓ – ఓ ఓ ఓ ఓ ఓ – ఓ ఓ ఓ ఓ ఓ
రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు – పుట్టే బాల యేసునిగా
గొల్లలెల్ల చూచిరి జ్ఞానులారాధించిరి – దూత తెలియజేయంగా
సర్వమానవాళికి సంతోషమైన వార్త – ఆయన ప్రజలందరికీ సమాధానము
4. తూరురు రురు రూ రురురు – తూరురు రురు రూ రురురు
తూరురు రురు రూ రురురు – తూరురు రురు రూ రురురు
జన్మించినాడు శ్రీ యేసు రాజు – బెత్లెహేమందున
సర్వోనతుడు వెలసినాడు – రక్షణిచ్చుటకు
అ
క్షయ మార్గము – నడిపించే మానవుడై
నిజమే నిజమే – దీన నరుడై ఉదయించే
రేడు నేడు జనియించినాడు – ఆనందం.. అద్భుతం..
రేడు నేడు జనియించినాడు – సంతోషం.. సమాధానం..
5. రాజులనేలే రారాజు – వెలసెను పశువుల పాకలో
పాపుల పాలిట రక్షకుడు – నవ్వెను తల్లి కౌగిలిలో
భయము లేదు మనకిలలో – జయము జయము జయమహో
ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం
ఇది లోక కళ్యాణం – మేరి పుణ్యదినం
మేరి పుణ్యదినం… మేరి పుణ్యదినం…
6. గొల్లలు జ్ఞానులు చేరిరి యేసుని
కానుకలిచ్చిరి ప్రేమను పొందిరి – ఆనందమాయెగా…
ఆనందమాయెగా పాపము పోయెగా
ఆనందమాయెగా పాపము పోయెగా
పరము వీడి భువికి దిగిన యేసుని కొలువ
ఆకాశ వీధిలో కాంతులు చిందగా
కన్నుల విందుగా వెలిగెను తారొకటి
ఆకాశ వీధిలో కాంతులు చిందగా
కన్నుల విందుగా వెలిగెను తారొకటి – ఆకాశ వీధిలో…
7. ఇమ్మానుయేలుగా – యేసే మనకు తోడుగా
ఇలను జన్మించెగా – భయము లేదుగా
ఇమ్మానుయేలుగా – యేసే మనకు తోడుగా
ఇలను జన్మించెగా – భయము లేదుగా
అందకారమైన – పొంగే సంద్రమైన
నిన్ను విడువలేడు – యేసే నీకు తోడు
జయం జయం – హోసన్నా జయం జయం
శుభం శుభం – లోకానికి శుభం శుభం
గగనమే మురిసెను – తారయే మెరిసెను
పరమున దూతలే – పండుగ జేసెను
జయం జయం – హోసన్నా జయం జయం
శుభం శుభం – లోకానికి శుభం శుభం
8. శ్రీ యేసుండు జన్మించే రేయిలో – శ్రీ యేసుండు జన్మించే రేయిలో
నేడు పాయక బెత్లెహేమ యూరిలో – నేడు పాయక బెత్లెహేమ యూరిలో
కన్నియ మరియమ్మ గర్భమందున – కన్నియ…
కన్నియ మరియమ్మ గర్భమందున…
ఇమ్మానుయేలనెడి నామమందున – ఇమ్మానుయేలనెడి నామమందున
శ్రీ యేసుండు జన్మించే రేయిలో – శ్రీ యేసుండు జన్మించే రేయిలో
నేడు పాయక బెత్లెహేమ యూరిలో – నేడు పాయక బెత్లెహేమ యూరిలో
9. బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2)
పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2)
రండి రండి రండయో రక్షకుడు పుట్టెను (2)
రక్షకుని చూడను రక్షణాలు పొందను (2)
10. మురిసెను హృదయము – ముచ్చట తీరగా
రాజు వెలయగా – మహారాజు వెలయగా
తొలగెను మన భయం – కలిగెను స్థిర జయం
కృపను నిండగా – ధరణి బ్రతుకు పండగ
దీన బ్రతుకు గాధల్లో – జాలి చూప వచ్చాడమ్మో
దీన బ్రతుకు గాధల్లో – జాలి చూప వచ్చాడమ్మో
రారాజు పుట్టాడో – రాజ్యం తెచ్చాడో
భూలోకమొచ్చాడో – భోజ్యం తెచ్చాడో
రారాజు పుట్టాడో – రాజ్యం తెచ్చాడో
భూలోకమొచ్చాడో – భోజ్యం తెచ్చాడో
అర్ధరాతిరి పొద్దుకాడ – సద్దుమణిగే సందెకాడ
ముద్దుగానే పుట్టినాడు – స్వామి యేసయ్యో
భగ్గుమంటూ వెలుగు వచ్చే – సిగ్గు అంటూ చీకటి పోయే
మొగ్గలాంటి చుక్క పుట్టే – రారాజేసయ్యో
ఏరా బాబు పోదాం బాల యేసుని చూద్దాం
బోసి నవ్వులన్నీ చూసి మూటగట్టు
రారాజు పుట్టాడో – రాజ్యం తెచ్చాడో
భూలోకమొచ్చాడో – భోజ్యం తెచ్చాడో
రారాజు పుట్టాడో – రాజ్యం తెచ్చాడో
భూలోకమొచ్చాడో – భోజ్యం తెచ్చాడో
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."