జగదైక రక్షకుడు – Jagadaiyka Rakshakudu song lyrics
జగదైక రక్షకుడు – Jagadaiyka Rakshakudu song lyrics
పల్లవి :
జగదైక రక్షకుడు జన్మించె ఇలలో
మరియమ్మ తనయుడై చిన్ని యేసయ్య
లాలమ్మ లాలని జోల పాటలతో
ఎత్తుకొని హత్తుకొని ముధ్దాడెదన్
లాలి….జో లాలి…
లాలి …జో లాలి..
చరణం 1
మహిమాన్వితుడు మనుజాలి కొరకు
నరరూపధారిగా అవతరించెను
దివినున్న దూతలు స్తోత్రించుచుండగ
దీన జనులు దన్యులమని ప్రార్థించిరి
గొల్లలు జ్ఞానులు రక్షకుని మ్రొక్కి
పసిడి సాంబ్రాణి బోళము నర్పించిరి
లాలి…..జో లాలి…
లాలి…జో లాలి
చరణం 2
సద్గునశీలుడు సర్వలోక రక్షకుడు
నా ప్రాణ నాథుడు ధర కేతెంచెను
నిజదేవ స్థితిని దాపు చేసుకొని
వసుధ భక్తులందరిలో పవళించెను
యేసుని జననం వికసించెనే
సంతోషం ఆనందం మహా ఆశ్చర్యమే
లాలి…జో లాలి
లాలి …జో లాలి
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."