ధనమే మాయరా – Dhaname mayara
ధనము ధనము అంటు దానికై అడుగులేసుకుంటూ
డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ{2}
సిరిసంపదలంటూ బ్రతుకునుకాలరాసుకుంటూ..
మనీ మనీ అంటూ తనువును అగ్గిపాలు చేస్తున్న మానవా..!!!
పట్టుకుని వెళ్ళలేవురా చిల్లిగవ్వ కూడా….
చితిలో నీతో రావుగా అవి లక్షకోట్లయిన {2}
ధనమే ఒక మాయరా దానిలో పడకు సోదరా….
సిరియే ఒక మత్తురా దానికై ప్రయాస వద్దురా….{2}
ధనము ధనము అంటు దానికై అడుగులేసుకుంటూ..
డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ..
ధనమంత నీకు కావాలంటే అన్ననే చంపమంటుంది ఆస్తి పెంచుకోవాలంటే అక్రమంగా వెళ్ళమంటుంది {2} తరాలుతిన్నా తరగని ఆస్తులు సంపాదించమంటుంది తరిగిపోని ఆస్తోకటున్నదని మరిచిపోయేలా చేస్తుంది {2}
మానప్రాణాలు తీయమంటుంది
అనుబంధాలను తెంచమంటుంది
నీచ కార్యాలు చేయమంటుంది
వదిలెల్లాలని మరిపిస్తుంది
ధనమే ఒక మాయరా దానిలో పడకు సోదరా…. సిరియే ఒక మత్తురా దానికే ప్రయాస పడకురా….{2}
ధనము ధనము అంటు దానికై అడుగులేసుకుంటూ..
డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ..
ధనాన్ని దాచిన అననీయ తెచ్చుకున్నాడు మరణాన్ని
బహుమానాన్ని కోరిన బిలాము పొందుకున్నాడు శాపాన్ని {2}
బంగారాన్ని కోరిన గెహజి తెచ్చుకున్నాడు రోగాన్ని వెండిని ఆశించిన యుదా తీసుకున్నాడు ప్రాణాన్ని {2}
ఆరోగ్యాలను కోల్పోయారు
ఆత్మీయంగా చనిపోయారు
కీడులెన్నో కొని తెచ్చుకున్నారు
నరక యాతనలు పడుతున్నారు
ధనమే ఒక మాయరా దానిలో పడకు సోదరా…. సిరియే ఒక మత్తురా దానికే ప్రయాస పడకురా….{2}
ధనము ధనము అంటు దానికై అడుగులేసుకుంటూ
డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ{2}
సిరిసంపదలంటూ బ్రతుకును కాలరాసుకుంటూ
మనీ మనీ అంటూ తనువును అగ్గిపాలు చేస్తున్న మానవా!!!
పట్టుకుని వెళ్ళలేవురా చిల్లి గవ్వ కూడా …
చితిలో నీతో రావుగా అవి లక్ష కోట్లయినా{2}
ధనమే ఒక మాయరా దానికై ఆశపడకురా …
సిరియే ఒక మత్తురా దాన్ని దేవుని పనికై వాడరా…
ధనమే ఒక మాయరా దానిలో పడకు సోదరా…. సిరియే ఒక మత్తురా దానికై ప్రయాస వద్దురా
Dhaname mayara Lyrics, Telugu Christian Song
- Happy Happy Christmas Antu – హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటూ ఆర్భటించెదం
- Telugu Christmas Songs // Andala Tara Okati / 2020 /Josh Arasavelli /Emmanuel / Gullison Ministries
- నా ప్రియునికి ఒక తోట వున్నది – Na priyuniki
- Oka Asha Undhayya – ఒక ఆశ ఉందయ్యా
- Jehovah Jireh Telugu christian song lyrics – యెహోవా యిరే చూచుకొనును
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."