నూతన సంవత్సరములోకి – Nutana Sanvatsaramuloki song lyrics
నూతన సంవత్సరములోకి – Nutana Sanvatsaramuloki song lyrics
నూతన సంవత్సరములోకి
నను నడిపించిన యేసయ్య
నూతన వాగ్దానములనిచ్చి
నను దీవించిన యేసయ్య
క్రొత్త సృష్టిగా మార్చిన దేవా
క్రొత్త బలముతో నింపిన ప్రభువా ” 2 ”
నీకై జీవింతున్నయ్య
నిను నేను కీర్తింతునయ్య
నీ ప్రేమను ప్రకటింతునయ్య ” నూతన ”
గడచిన కాలమంతా
నీ దయా కిరీటము నుంచి
బ్రతుకు దినము లన్నిటను
నీ కృపా క్షేమములనిచ్చి ” 2 ”
కుడి ఎడమ లావరించి ఆశ్రయమై భద్రపరచి
ఉల్లాస వస్త్రమును దరియింపచేశావు
ఉన్నత స్థానములో నను నిలిపి నావు ” 2 ”
క్రొత్త సృష్టిగా మార్చిన దేవా
క్రొత్త బలముతో నింపిన ప్రభువా ” 2 ”
నీకై జీవింతునయ్య నిను
నేను కీర్తింతునయ్య
నీ ప్రేమను ప్రకటింతునయ్య ” నూతన ”
పాతవి గతియింపజేసి
సమస్తము నూతన పరచి
రక్తముతో విడిపించి
నీ వాక్యముతో నడిపితివే ” 2 ”
మెళులతో తృప్తి పరచి
ఆనంద తైలముతో నింపి ” 2 ”
రాజుల వంశములో నను చేర్చినావు
శత్రు బలమంతటిపై జయమిచ్చినావు ” 2 ”
క్రొత్త సృష్టిగా మార్చిన దేవా
క్రొత్త బలముతో నింపిన ప్రభువా ” 2 ”
నీకై జీవింతున్నయ్య నిను
నేను కీర్తింతునయ్య
నీ ప్రేమను ప్రకటింతునయ్య ” నూతన “
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."