యునైటెడ్ క్రిస్మస్ మెడ్లి 2023 christmas songs
యునైటెడ్ క్రిస్మస్ మెడ్లి 2023 christmas songs
దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేము నందున
భూజనంబు కెల్లను – సౌఖ్య సంభ్రమాయెను
ఆకసంబు నందున – మ్రోగు పాట చాటుడి
దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
Hark! The herald angels sing
“Glory to the new-born king
Peace on earth and mercy mild
God and sinners reconciled”
Joyful all ye nations rise
Join the triumph of the skies
With angelic host proclaim
“Christ is born in Bethlehem”
Hark! The herald angels sing
“Glory to the new-born king”
ఓ సద్భాక్తులారా – లోక రక్షకుండు
బెత్లేహేమందు నేడు జన్మించెన్
రాజాధి రాజు – ప్రభువైన యేసు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో
సర్వేశ్వరుండు – నర రూపమెత్తి
కన్యకు బుట్టి నేడు వేంచేసెన్
మానవ జన్మ – మెత్తిన శ్రీ యేసూ
నీకు నమస్కరించి నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము
అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో
ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని ||అందాల తార||
ప్రభుజన్మస్ధలము పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ జీవితమెంత పావనమాయెను
ప్రభుపాదపూజ దీవెనకాగా ప్రసరించె పుణ్యము
బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన. ||అందాల తార||
రారె చూతము రాజ సుతుడీ రేయి జనన మాయెను (2)
రాజులకు రా రాజు మెస్సియ (2)
రాజితంబగు తేజమదిగో (2) ||రారె||
దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా (2)
దేవుడే మన దీనరూపున (2)
ధరణి కరిగెనీ దినమున (2) ||రారె||
బాలుడడుగో వేల సూర్యల బోలు సద్గుణ శీలుడు (2)
బాల బాలిక బాల వృద్ధుల (2)
నేల గల్గిన నాధుడు (2) ||రారె||
Joy to the world, the Lord is come
Let Earth receive her King
Let every heart prepare Him room
And Heaven and nature sing
And Heaven and nature sing
And Heaven, and Heaven, and nature sing….
హాయి, లోకమా! ప్రభువచ్చెన్
అంగీకరించుమీ
పాపాత్ములెల్ల రేసునున్
కీర్తించి పాడుఁడీ.
సత్రమందున పశుల శాలాయందున//2//
దేవ పుత్రుండు మనుజుండాయేనందున //2//
శ్రీ యేసు౦డు జన్మించే రెయిలో//2//
నేడు పాయక బెత్లెహెమయురిలొ//2//
కన్నియ మరియమ్మ గర్భమందున//2//
ఇమ్మనుయెలనెడి నామమందున //2//
పరలోకాపు సైన్యంబు కూడేను//2//
ఇంట వరక్షకుని గూర్చి పాడాను//2//
మన కొరకు ఒక శిశువు పుట్టెను//2//
ధరను మన దోషములను పోగొట్టెను//2//
పట్టి పొత్త్తిగుడ్దలతో చుట్టబడి//2//
పశుల తొట్టీలో పరుండబెట్టబడి//2//
అక్షయుండగు యేసు వచ్చెను //2//
మనకు రక్షణంబు సిద్ధపర్చెను //2//
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."