Ashrayuda Naa Yesayya song lyrics – ఆశ్రయుడా నా యేసయ్యా
Ashrayuda Naa Yesayya song lyrics – ఆశ్రయుడా నా యేసయ్యా Hosanna Ministries
ఆశ్రయుడా నా యేసయ్య
స్తుతి మహిమప్రభావము నీకేనయ్యా (2)
విశ్వవిజేతవు – సత్యవిధాతవు
నిత్యమహిమకు ఆధారము నీవు (2)
లోకసాగరాన కృంగినవేళ
నిత్యమైనకృపతో వాత్సల్యము చూపి
నను చేరదీసిన నిర్మలుడా
నీకేనయ్యా ఆరాధనా
నీకేనయ్యా స్తుతిఆరాధనా (2) ||ఆశ్రయుడా||
- తెల్లని వెన్నెలకాంతివి నీవు
చల్లని మమతల మనసే నీవు (2)
కరుణనిచూపి కలుషముబాపి
నను ప్రేమించిన ప్రేమవు నీవు (2)
జనులకు దైవం జగతికి దీపం
నీవుగాక ఎవరున్నారు ?
నీవే నీవే ఈ సృష్టిలో
కొనియాడబడుచున్న మహరాజువు (2) ||ఆశ్రయుడా|| - జీవితదినములు అధికములగునని
వాగ్దానముచేసి దీవించితివి (2)
ఆపత్కాలమున అండగనిలిచి
ఆశలజాడలు చూపించితివి (2)
శ్రీమంతుడవై సిరికే రాజువై
వ్యధలనుబాపి నా స్థితిమార్చితివి
అనురాగమే నీ ఐశ్వర్యమా
సాత్వికమే నీ సౌందర్యమా (2) ||ఆశ్రయుడా|| - నీ చిత్తముకై అరుణోదయమున
అర్పించెదను నా స్తుతిఅర్పణ (2)
పరిశుద్ధులలో నీ స్వాస్థ్యముయొక్క
మహిమైశ్వర్యము నేపొందుటకు (2)
ప్రతివిషయములో స్తుతి చెల్లించుచు
పరిశుద్ధాత్మలో ప్రార్థించెదరు
పరిశుద్ధుడా పరిపూర్ణుడా
నీ చిత్తమే నాలో నెరవేర్చుమా (2) ||ఆశ్రయుడా||
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."