Deva Stothraganamul pai – దేవస్తోత్రగానముల్ పై దివ్య స్థలములో
Deva Stothraganamul pai – దేవస్తోత్రగానముల్ పై దివ్య స్థలములో
దేవస్తోత్రగానముల్ పై – దివ్య స్థలములో
దేవమారుగానముల్ భూ – దేశ స్థలములో
దేవలోక పావనులును – దీన నరులును బోవజూడ
భువిదివి క్రిస్మస్
అవ్వకిచ్చినట్టి వాక్కు – అదిగో తొట్టిలో
పవ్వళించి యున్నదేవ – బాల యేసులో
ఇవ్విధముగ సఫలమాయె – ఈ దినంబున
నవ్వు మోము – నరుని కబ్బెను
షేము దేవ వందనంబు – చెప్పబడియెను
భూమి స్తుతుల నందు కొనెడి – పూజనీయుడు
భూమి పైన నరుడుగాను = బుట్టవచ్చెను
భూమి క్రిస్మస్ – భోగమొందెను
అందరి వంశంబులు నీ – యందు దీవెన
బొందునంచు నబ్రామునకు – నందెను వాక్కు
అందె క్రీస్తు – యూదులకును అన్యజనులకున్
విందు క్రిస్మస్ – విశ్వమంతటన్
షీలోహువచ్చు వరకు యూ – దాలో నిలుచుచు
నేలు రాజదండముండు నెపుడు తొలగదు
నేల మీద నిత్యశాంతి పాలన జేయ – పాలకుండౌ
బాలుడు జన్మించెన్
అక్షయమగు చుక్క యొకటి – యాకోబులో
లక్షణముగ బుట్ట – వలయును ధాత్రి పై
రక్షణార్ధులే స దాని – రీక్షించెడు నక్షత్రంబగు
రక్షకుడుదయించె
పుట్టవలయు మోషే వంటి – పూర్ణ ప్రవక్త
ఎట్టి వారలైన నెరుగ – నట్టి ధర్మముల్
దిట్టముగను స్థాపింప – దేవ పుత్రుడు – పుట్టెన్
గొప్ప – బోధకుడయెను
మరియ పుత్ర నామ – మిమ్మానుయేలగున్
నరులకు దేవుండె తోడు – నిరతము వరకున్
దరిని దేవుడుండు గాన – వెరువ మెన్నడున్
పరమ దేవుని సహ – వాసము లభించెన్
మన నిమిత్తమైన శిశువు – మహిని బుట్టెను
చనువుగ దరిజేర శిశువు -స్వామి యాయెను
తనువు రక్షణను గణింప – వెనుక దీయడు
వియన భూషణులకు – వేళ వచ్చెను
మొలకలెత్త వలె యెష్షయి – మొద్దునందున
ఫలము లేని మోడు నరుల – వంశవృక్షము
విలువ గలుగు నిత్యజీవ – ఫలవమె లిడుటకై
కళగల జన్మార్ధ – కరుడు వచ్చెను
ఖలలు చీకటిన్ నడుచుచు – వెలుగు చూచిరి
పలు విధంబులైన యట్టి – పాప చీకటుల్
తొలగజేసి శుద్ధ కాంతి – కలుగ చేయను
వెలుగుగా దేవుడు వెలసె – ధాత్రిలో
అల్పమైన బెత్లెహేము – నందున క్రీస్తు
నిల్పవలెను తనదు జన్మ – నిజ చరిత్రను
అల్పులందు సైతమల్ప – మైన యూళ్ళలో
సల్ప రక్ష – స్థాపకుడై వచ్చె
ఆడి తప్పనట్టి దేవ – అనంత స్తోత్రముల్
నాడు పల్కు వాగ్ధా -నముల నన్నిన్
నేు నెరవేర్చినావు – నీ సుతునంపి – కీడుల్
బాపు – క్రిస్మసు గల్గె
నీ నిజ వాగ్ధత్తములను – నిత్యము నమ్మి
వాని నెరవేర్పులు విని – వట్టివి యనక
మానసమున ననుభవించు – మనసునీయుమని
దానామూల్య – జ్ఞాన మొసగుమీ
గగన మందు క్రిస్మసుండు – గాన కీర్తుల
జగతి యందు క్రిస్మసుండు – స్థవము గల్గుత
యుగయుగముల వరకు త్త్రైకు -డొందు ప్రణుతులు
సొగసుగ బరగెడు – చోద్య గీతముల్
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: Bishop dawit molalgnchinese christian songsChristianChristian EthiopiaChristian songsjapanese christian songskorean christian songskorean christmas songsmarcil tvOrthodox tewahdoPastor DawitProtestant Worshipsami mulugetasinger carol fikadusinger helina dawitsinger kefa mideksatelugu christian songsyonatan aklilu