Edu Matalu Palikinava song lyrics – ఏడు మాటలు పలికినావా
Edu Matalu Palikinava song lyrics – ఏడు మాటలు పలికినావా
ఏడు మాటలు పలికినావా = ప్రభువ – ఏడు ముఖ్యాంశములు – ఎరుక
పరచితివా
1. దేవుండవు కాని యెడల – నిన్ను – తిప్పి చంపువారిన్ – క్షమియింప
గలవా = జీవమై యుండని యెడల – నిన్ను – చావు దెబ్బలు గొట్ట
– సహియింప గలవా (లూకా 23:34)
2. రక్షణ కథ నడిపినావా – ఒకరిన్ – రక్షించి పరదైసు – కొనిపోయినావా
= శిక్షితునికి బోధింపకనే – శాంతి – లక్షణము చూపుచు –
రక్షించినావా (లూకా 23:43)
3. తల్లికి నొక సంరక్షకుని – నిచ్చి – ఎల్లకరకు మాదిరి – కనపరచినావా
= తల్లికి సృష్టికర్తవై – ప్రేమ తనయుండవై గౌర – వించి యున్నావా
(యోహాను 19:26, 27)
4. నరుడవు కాకున్న యెడల – దేవ – నన్నేల విడిచితి – వని యడిగినావా
= నరుడవును దేవుండవును – గాన – నా పూర్ణ రక్షకుడ – వని
ఋజువైనావా (మార్కు 15:34)
5. ఎన్నిక జనుల ద్వేషంబు – నీకు – ఎండ యైునందున – దప్పి
గొన్నావా = ఉన్న యెండకును బాధకును – జిహ్వ – కూట లేనందున
– దాహమన్నావా (యోహాను 19:28)
6. పాపుల రక్షణ కొరకు – చేయ – వలసిన పనులెల్ల – ముగియించినావా
= ఆ పగలు పగవారి – తుదకు – అంతము కాగా సమాప్త మన్నావా
(యోహాను 19:30)
7. కనుక నీ యాత్మన్ మరణమున – నీదు – జనకుని చేతుల –
కప్పగించితివా = జనులందరును యీ పద్ధతినే – కడను –
అనుసరించునట్లు – అట్లు చేసితివా (లూకా 23:46)
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."