Entha Goppa Bobba Puttenu – ఎంత గొప్ప బొబ్బ పుట్టెను
Entha Goppa Bobba Puttenu – ఎంత గొప్ప బొబ్బ పుట్టెను
ఎంత గొప్ప బొబ్బ పుట్టెను – దానితో రక్షణ యంతయును సమాప్త
మాయెను = ఎంత గొప్ప బొబ్బ పుట్టెను – యేసునకు
గల్వరి మెట్టను సంతసముతో సిల్వ గొట్టగ –
సూర్యుండంధకార మాయెను
గలిబిలి గలిగె నొకప్పుడు – శిన్యారు బాబెలు కట్టడమును కట్టు
నప్పుడు = పలుకు భాషయు – నొక్కటైనను – పలువిధములగు
భాషలాయెను – నలు దెసలకును – జనులు పోయిరి కలువరి
కలుసుకొనిరి
పావనుండగు ప్రభువు మన కొరకై – యా సిలువ మీద చావు
నొందెడు = సమయమందున – దేవుడ నా దేవుడ – నన్నేల
చెయి విడిచితివి యని యా – రావముగ మొరబెట్టెను
యె – హోవయను దన తండ్రితోన
అందు దిమిరము క్రమ్ము గడియయ్యె – నా నీతి సూర్యుని నంత
చుట్టెను బంధకంబులు – నింద వాయువులెన్నో వీచెను కందు
యేసుని యావరించెను – పందెముగ నొక కాటు వేసెను –
పాత సర్పము ప్రభువు యేసును
సొంతమాయె నటంచు బలుకుచు – ఆ రక్షకుడు తన – స్వంత
విలువగు ప్రాణమును వీడెన్ – ఇంతలో నొక భటుడు
తనదగు నీటెతో ప్రభు ప్రక్కబొడువగ – చెంత చేరెడి
పాపులను రక్షించు రక్తపు ధార గారను
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."