Karunamayuda song lyrics – కరుణామయుడా
Karunamayuda song lyrics – కరుణామయుడా
కరుణామయుడా జీవనధాత
మృత్యుంజయుడా యేసు రాజా
కరుణామయుడా జీవనధాత
నేల నుండి మట్టిని తీసి
నీ రూపము నందు
మానవునిగా చేసి
జీవాత్మను ఊదావు -2
ఎండిన ఎముకలన్నిటిని
నీ మాట చేత
గొప్ప జన సమూహముగా
మార్చిన ఓ గొప్ప దేవా
నీ క్రియలను నేను వర్ణింప లేనయ్యా
కేరీతు వాగు దగ్గర
దాగి ఉన్న ఏలియాకు
కాకోలముకు ఆజ్ఞ ఇచ్చి
ఆహారము పంపితివి -2
ఎండిన భూమంతయు జలమయముగా చేసి
తొలకరి వానలతో నన్ను తృప్తి పరచిన దేవా
నీ ప్రేమను నేను వర్ణింపలేనయ్యా
వేదనలో ఉన్న నేను
నిన్ను ప్రార్థించగా
నా వేదన తీసి
ఆనందము నిచ్చితివి -2
నా పాపము కోసమే
సిలువలో మరణించి
సమాధిని బ్రద్దలు చేసి
మృత్యుంజయుడయ్యావు
నీ బలమును నేను వర్ణింపలేనయ్యా
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."