Manoharuda Padivelalo Athi Sundaruda – మనోహరుడా పదివేలలో అతి సుందరుడా
Manoharuda Padivelalo Athi Sundaruda – మనోహరుడా పదివేలలో అతి సుందరుడా
మనోహరుడా పదివేలలో అతి సుందరుడా
మహావీరుడా భువనాలనేలే బలశూరుడా
ఎంతని నేను వివరించగలను
భువియందు దివియందు నీ మహిమను
ఎవరిని నీతో సరిపోల్చగలను
తలవంచి స్తుతియించి కీర్తించగ
నిన్నే ఆరాధించెదను – నీలో ఆనందించెదను II2II
నీ అనురాగమునకై అభివాదము IIమనోహరుడాII
గోపరసమంత సువాసన నీకే సొంతమైనది
అడవిలో జల్దరు వృక్షముల అతికాంక్షనీయుడా
ఏన్గెది ద్రాక్ష వనమందున – కర్పూర పుష్పాల సమానుడా
నాకెదురుగా నీవు నిలిచావని
నిన్నే ఆరాధించెదను – నీలో ఆనందించెదను II2II
నీ అనురాగమునకై అభివాదము IIమనోహరుడాII
ఆరని మారని ప్రేమను నాపై చూపినావు
వీడని నీడగ నీ కృపను ధ్వజముగా నిలిపినావే
మోడైన నా గోడు వినిపించగా – నా తోడుగా
నీవు నిలిచావుగా
నిన్నే ఆరాధించెదను – నీలో ఆనందించెదను II2II
నీ అనురాగమునకై అభివాదము IIమనోహరుడాII
కొండలు మెట్టలు దాటుచూ – ప్రియుడేతెంచువేళ
పావుర స్వరము దేశమున వినిపించుచున్నది
పైనుండి శక్తిని పొందేందుకు నీ సన్నిధిలో నేనుందును
ఆనంద తైలముతో నను నింపిన
నిన్నే ఆరాధించెదను – నీలో ఆనందించెదను II2II
నీ అనురాగమునకై అభివాదము IIమనోహరుడాII
పచ్చిక బయల్లే నీవు నేను కలిసే చోటనీ నీ మందిరములో ప్రతిదినము నే వేచియుందును
వనవాసాలెన్ని అడ్డొచ్చినా – మానవాసమెపుడూ మారదులే
నా మార్గదర్శివి నీవై నడిపించిన
నిన్నే ఆరాధించెదను – నీలో ఆనందించెదను II2II
నీ అనురాగమునకై అభివాదము IIమనోహరుడాII
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."