Mithruda Rarammu – మిత్రుడా రారమ్ము మైత్రితో పార
Mithruda Rarammu – మిత్రుడా రారమ్ము మైత్రితో పార
మిత్రుడా రారమ్ము – మైత్రితో పార –
మార్థికమైన – మాటల్ వచింతు –
మన్ననతో విను
పూర్వ జన్మము నందు – పూర్తిగా పాపిని
అందుకె ఈ బాధ – పొందుచునున్నాను
అని యిట్లు మనస్సులో – అనుకొననే వద్దు
అది నిజమే యైన – అది కూడ పోగొట్టు
రక్షకుడున్నాడు – తత్క్షణమె రమ్ము
ఆయన మానవుడై నట్టి దేవుండు
ఈ మాట నమ్మిన – ఎంత ధన్యుండవు
మనస్సులో ముద్రించు – కొని శాంతి పొందుము
ఈ జన్మమున గూడ – ఎన్నెన్నో పాపాలు
చేసియున్నందున – చివరకు నరకంబె
అని ఆత్మయందున – ఆలోచనెందుకు
అవి సిల్వపై యేసు – అంతరింప జేసె
ఆ వృత్తాంతంబును – ఆనందమున
నమ్మి సుఖముగ నుండుము
సూక్ష్మ మార్గంబిది ఎందరెన్నియన్న
ఏ మాటల్ వినవద్దు దేవ వాక్కె
నిజము – దిక్కులు చూడకు
తల్లిదండ్రుల్ చేసిన – తగని కార్యంబులు
నా మీదికె పొర్లి – నను జంపు చున్నవి
ఆ శాపమును నేను – అడ్డగింపలేను
అని పల్కుచును నీవు – అదరిపోకూడదు
పాపమని తెలియని – పాపాలు ఎన్నెన్నో
చేయ బట్టి యిన్ని – చిక్కులు నను జుట్టె
అని లేనిపోనట్టి – వనుకొనకుండుము
నీ పాపముల కంటె – నీ తండ్రి దయ గొప్ప
నీ పాప శాపాలు – నీ సర్వ వ్యాధులు
మోసికొన్నట్టి శ్రీ – యేసు దేవుడు ముందె
నీ కీడు పోగొట్టి – నీ కెన్నియో మేళ్ళు
సంపాదనము చేసె సర్వోపకారుండు
దేవుండు మానవుండు దివిలోన భువిలోన
నిను బట్టి పాపివి – నిను జూడనే వద్దు
ప్రభు యేసుని బట్టి – పరిశుద్ధుడవు నీవు
ఆయనను జూచిన అంతయు సరియౌను
ఇంటిలోని పోరు – ఇంకిపోవును గాక
వాదాలు బేదాలు వాడిపోవును గాక
కలహాలు నీటను కలిసిపోవును గాక
యుద్ధాలు క్రమముగ – ఉడిగి పోవును గాక
అన్ని పాపాలును అంతరించును గాక
సర్వ దేశములందు – శాంతి కలుగును గాక
నాగరికత ప్రతి – నరుని కబ్బును గాక
దేవుని మ్రొక్కుట తేజరిల్లును గాక
ఆయన బోధలే అలుము కొనును గాక
ప్రజలందరికి దైవ – భక్తి పెరుగును గాక
మంచి జీవిని – కనికరించు చుందురు గాక
పాడి పంటలు ప్రతి – వాని కుండును గాక
వెలుగు, నీరు, గాలి – కలుగ జేసిన తండ్రి
మన యందరి వలన ఘనత నొందును గాక
దివ్య దేవుడు నిన్ను – దీవించును గాక
భూమి చేసిన వాడు – పోషించును గాక
రక్షకుండౌ క్రీస్తు – రక్షించును గాక
పరమ వైద్యుడు స్వస్థ – పరచు చుండును గాక
పనులన్నిని సఫల – పరచు చుండును గాక
దైవాత్మ ధైర్యంబు – తెచ్చు చుండును గాక
అంతాన మోక్షంబు – అందజేయును గాక
విజయము ఈ పాట – విను వారి కామెన్
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."