Na Manase – నా మనసే మందసము
నా మనస్సె మందసము … || నా మనస్సె ||
నా దేహం దేవాలయము…
నీ ఆజ్ఞను మోసె పల్లకిని నేను…
నీ నీతిని నానుండి వ్యాపింపచేసెదను
నా తండ్రి యెహోవా… నా ప్రభువా దేవా
నీ నుండి ఏదైన వేరుచేయగలవా….. || నా మనస్సె ||
రాజ్యములను పాలించిన రాజులను చూసాను
పూజలందుకున్నారని వారి కొరకు విన్నాను
దేవుడవైయుండి మనిషి పాదాలు కడిగిన
దీనుడైన దేవునిగ నిన్ను చూచుచున్నాను
ప్రభువా నిన్ను చూచుచున్నాను….. || నామనస్సె ||
చిన్ని చిన్ని పక్షులకు గుళ్లుండుట చూసాను
ఇంటినే స్వర్గముగ చేసుకున్నారని విన్నాను
జగమంతా నీదైనా జనమంతా మారాలని…..
తలవాల్చగ స్థలము లేని నిన్ను చూచుచున్నాను
యేసు నిన్ను చూచుచున్నాను….. || నా మనస్సె ||
రాజులకు రాజువయ్యా యేసుక్రీస్తు ప్రభువ
నీ వలనే వచ్చింది ఏ రాజుకైన విలువ
నీవు స్థాపించిన రాజ్యములో కలతలేమి ఉండవని
అది ప్రేమకు ఐక్యతకు నిలయమని విన్నాను
క్రీస్తు రాజ్యములో ఉన్నాను….. || నా మనస్సె ||
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."