Nakemi Koduva Nadhudunda Ika Srikarundagu Devude – నాకేమి కొదువ నాథుడుండ ఇక
Nakemi Koduva Nadhudunda Ika Srikarundagu Devude – నాకేమి కొదువ నాథుడుండ ఇక
నాకేమి కొదువ – నాథుడుండ ఇక
శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠపాలకుడు
నా యేక రక్షకుడ
ఎన్నికైన – ఎండనట్టి = సన్న పచ్చిక
విం తరుగని – సదుపాయంబుల్ –
నా – కెన్నో చేయున్ గనుక
తనివి తీరన్ మే – ళ్ళనుభవింప =
నను సదా మేళ్ళనెడి పచ్చిక –
నదిమి మృదువుగ – పండు – కొన జేయును గనుక
ఎంత శోధన – యెండయున్న =
ఎంతకు న్నోరిగర దెపుడు – శాంత
జలములు – నా – చెంతనే యుండున్ గనుక
తప్పిపోయిన నన్ – దారింబెట్టి –
తెప్పరిల్ల చేసి నాకు – తీర్చు నలసటను –
నా – తప్పు మన్నించున్ గనుక
నీతి మార్గమునన్- నిల్పును నన్ను =
నీతి లేని నాకు తన సు – నీతి దయచేయున్ –
స్వ – నీతిన్ ద్రుంచున్ గనుక
చావు చీకట్ల – శక్తియుండు =
లోయలో బడి పోవలసినను-నే వెరువకుండ –
నా – దేవుడే తోడు గనుక
కష్టంబులను చీ – కటి లోయలో =
స్పష్టముగ ఘన సౌఖ్యమును నా – దృష్టికింజూపి –
నా – నష్టముల్ దీర్చున్ గనుక
మీద పడునట్టి – శోధనలన్ =
నా దరికి రానీక దండము – నన్ను
లాగుచును – నా – కాదరణయౌను గనుక
పగవారల్ సిగ్గు – పడునట్లుగ =
జగతి యెరుగని సౌఖ్యభోజన – మగు పరచుచున్ –
హా – తగినదే పెట్టున్ గనుక
తన యాత్మానంద – తైలంబుతో =
అనుదినము తలయిం విసుగు – కొనక
తుడుచును – నా – కను నీళ్ళన్నీ గనుక
పలు విధములైన – భాగ్యములతో =
వెలుపలికి దిగ వెడలున్టి – వెలగల గిన్నె –
నా – కలిమిగా జేయున్ గనుక
బ్రతుకంతటన్ – కృ- పా క్షేమముల్ =
వదలకుండగ వచ్చు నాతో – సుదినములు గల్గు –
నా – పదలు సంపదలౌ గనుక
దురితంబులుండు – ధరణి నాకు =
ఇరవు కాదిక నెప్పటికినా – పరమ దేవుని –
మం – దిరమె నా యిల్లు గనుక
కావలసిన వెల్ల – కనబడగలవు =
ఏవి యడిగిన – వాని నిచ్చి
వేయును తండ్రి – ఇచ్చి
ధన సహాయంబు – మనకు గల్గు =
అనుదినంబు – తండ్రి మనకు
అక్కరలు తీర్చు – మన
ప్రభువు దూతలును – పరిశుద్ధులున్
విభవముగ మన మధ్య- మసలుచు
వెలుగు చుందురుగా – హా
జనకుని ఇష్ట జనము వచ్చు –
తనకు యిష్టము గాని జనమును –
దరికి రానీయడు – ఈ
మా మిత్రులైన – మహిమ దూతలే
క్షేమమునకై మా చుట్టు – చేరి
కాయుదురు – చుట్టు
అందరు మేళ్ళు – అనుభవింప =
విందుగా సమకూడు వార్తలు –
విని పించును – తండ్రి
ప్రభుని శరీర – రక్తములు =
ఉభయ జీవితములకు మేలై-
ఉండును నాకు – మేలై
నైజ పాపములు – నశియించుటకే =
భోజనము వడ్డించును –
రాజే స్వయముగా – దేవ
నీ మనసులోనివి – నెరవేరును =
క్షేమము గనే ఉండవలయు –
చింత లేకుండ – నీవు
నాకు నా తండ్రి – నర రూపముతో =
త్రైకుని రీతిగా కనబడి –
ధైర్య మిచ్చును – నాకు
జనక సుతాత్మ – లను దేవుడు =
ఘనముగా యుగ యుగములన్నిట –
వినుతు లొందును – నేనా – యన గొర్రెనే గనుక
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."