
Nenundalenayya – నేనుండలేనయ్యా ఒక క్షణమైనా నిను
Nenundalenayya – నేనుండలేనయ్యా ఒక క్షణమైనా నిను
ప | నేనుండలేనయ్యా ఒక క్షణమైనా నిను
స్తుతియించక యేసయ్యా
నిలిచి యుండలేనయ్యా నీదు ప్రేమను
వివరించకుండా యేసయ్యా
అ|ప ||ఊహించలేని మేలులు చేసి నను క్షమియించి
రక్షించితివే //2
శాశ్వతమైన ప్రేమ చూపి నీ కృపలో
దాచినావు – నాకు చాలిన దేవుడవే //2
1) పలుకరిస్తావు ప్రతి ఉదయం
శాశ్వతమైన నీ కృపతో
ప్రతి రాత్రిలో నీ విశ్వాస్యతతో
తోడైయుండి కాపాడెదవు
నా పయనంలో గమ్యము నీవే
ప్రతి పరిస్థితిలో నా నేస్తం నీవే
నేనేమైయున్నానో కేవలం నీ కృప
నాకున్నవన్నియు యేసూ నీ దయా
నీ కొరకే ఇల బ్రతికించు దేవా
నా రధసారధివై నడిపించుమా
2) నే క్రుంగియుండగ నా దరిచేరి
ఆధరించావు వాత్సల్యముతో
నా ప్రాణమునకు క్షేమము దయచేసి
నీ సన్నిధిలో నను నిలిపితివే
కన్నీరు రానియ్యక – నా పాదము
జారనియ్యక
నిన్ను స్తుతియించే అర్హతనిచ్చావు
వెనుతిరిగి చూడని విశ్వాసమునిచ్చి
విడువక నాతోడై నడిపిన దేవా
మిళితమై నా మనసున – నిలిచినా
నా ప్రాణమా
మలినమైన బ్రతుకునా
మ్రోగినా సంగీతమా
ఘనమైన నీ పరిచర్యలొ నే
నిరతం సాగనీ #2#