Prabhu prema tholi keka – ప్రభుప్రేమ తొలికేక
Prabhu prema tholi keka – ప్రభుప్రేమ తొలికేక
ప్రభుప్రేమ తొలికేక – హృదయములో ప్రతిధ్వనియించే
పాప క్షమా యేసునిలో- శరణు నొసంగుచు కనిపించే
1. పాపవికారము పొడసూప – జీవిత విలువలు మరుగాయె
ఫలితముగా లోకములో- బ్రతుకుటయే నా గతియాయె
పలువురిలో కనబడలేకా – దాహము తోనే నొంటరిగా
బావికని పయనింపా – నాధుని దర్శన మెదురాయే
పావనుడు దాహముతో – జలమును ఇమ్మని ననుగోరె ||ప్రభు||
2. జాతినిచూడని నేత్రముతో – పాపము శోకని హృదయముతో
జాలిని చాటించుచునే – తాకెను నామది వేదనతో
జాప్యము చేయక తెమ్మనియే – దాచుకొనిన నా పాపమును
జడియుచునే తెలిపితిని – ప్రభు వెరిగిన నా నిజస్థితిని
జయమొందె నాతనువూ – సరిగ నుడితివని ప్రభు తెలుపా ||ప్రభు||
3.దేహమునే నా సర్వముగా – భావించుచు మది పూజింపా
దినదినమూ జీవితమూ – చావుగ మారిన కాలములో
దేవునిగా నా బంధువుగా – మరణ ప్రవాహము ఛేదించి
దరిజేర్చి దీవించి – నూతన జన్మ ప్రసాదించే
దయ్యాల కుహరమును – స్తుతి మందిరముగ రూపించే||ప్రభు||
Prabhu prema tholi keka song lyrics
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."