యేసయ్యే నా ప్రాణం – Yesayye Naa Praanam song lyrics
యేసయ్యే నా ప్రాణం – Yesayye Naa Praanam song lyrics
యేసయ్యా నా ప్రాణమా – ఘనమైన స్తుతిగానమా
అద్భుతమైన నీ ఆదరణే – ఆశ్రయమైన నీ సంరక్షణయే
నను నీడగ వెంటాడెను – నే అలయక నడిపించెను
నా జీవమా – నా స్తోత్రమా -నీకే ఆరాధన
నా స్నేహము – సంక్షేమము – నీవే ఆరాధ్యుడా
చిరకాలము నాతో ఉంటానని – క్షణమైనా వీడిపోలేదని
నీలో ననుచేర్చుకున్నావని – తండ్రితో ఏకమై ఉన్నామని
ఆనందగానము నే పాడనా
ఏదైనా నాకున్న సంతోషము – నీతోనే కలిగున్న అనుబంధమే
సృజనాత్మకమైన నీకృప చాలు – నే బ్రతికున్నది నీకోసమే
జీవజలముగా నిలిచావని – జలనిధిగా నాలోఉన్నావని
జనులకు దీవెనగ మార్చావని – జగతిలో సాక్షిగ ఉంచావని
ఉత్సాహగానము నే పాడనా
ఏదైనా నీకొరకు చేసేందుకు – ఇచ్చితివి బలమైన నీశక్తిని
ఇదియేచాలును నా జీవితాంతము – ఇల నాకన్నియు నీవేకదా
మధురముకాదా నీ నామధ్యానం – మరుపురానిది నీ ప్రేమమధురం
మేలుచేయుచు ననునడుపువైనం – క్షేమముగా నా ఈలోకపయనం
స్తోత్రగీతముగా నే పాడనా
నిజమైన అనురాగం చూపావయ్యా – స్థిరమైన అనుబంధం నీదేనయ్యా
స్తుతుల సింహాసనం నీకొరకేగా – ఆసీనుడవై ననుపాలించవా
స్తుతిపాత్రుడా – స్తోత్రార్హుడా నీకే ఆరాధన
ఆనందమే పరమానందమే – నీలో నా యేసయ్యా
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: telugu christian songs