Yesukristuni Siluva Epudu – యేసు క్రీస్తుని సిలువ
Yesukristuni Siluva Epudu – యేసు క్రీస్తుని సిలువ
యేసు క్రీస్తుని సిలువ – ఎపుడు ధ్యానము చేయు
మాసతోను సోదరా = మన దోసంబు నెడబాపు
ఈ సంతాప మరణ – వ్యాసంబుచే సోదరా
ధీరుండై దీనుండై – ధారుణ్య పాప భారంబు
మోసెను సోదరా = తన్ను జేరిన వారిని
పారదోలనని – ఎవరు బల్కిరి సోదరా
ఎండచే గాయములు – మండుచు నుండెను
నిండు వేదన సోదరా = గుండె నుండి నీరుకారు
చుండె దుóఖించుచు – నుండు వేళను సోదరా
ఒళ్లంత రక్తము – ముళ్ళ కిరీటము
తలపై బెట్టిరి సోదరా = ఒకడు బళ్ళెంబుతో బొడవ
నీళ్ళు రక్తము గారె – చిల్లులాయెను సోదరా
కటకటా – పాప సంకటము బాపుట కింత
ఎటులోర్చితివి సోదరా = ఎంతో కఠిన హృదయంబైన
అటు చి తరచినా – కరగిపోవును సోదరా
పంచ గాయములు – నే నెంచి తలంచినా
వంచన యిది సోదరా = నన్ను వంచించు సైతాను
వల నుండి గావ తానెంచి బొందెను సోదరా
మరణమైనప్పుడు – ధరణి వణికెను గుడి
తెర చినిగెను సోదరా = ఉరు గిరులు బండలు బద్ద
లాయె సమాధులు – తెరువ బడెను సోదరా
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."