Yesuni Sweekarinchu song lyrics – యేసుని స్వీకరించు
Yesuni Sweekarinchu song lyrics – యేసుని స్వీకరించు Hebron Songs Songs of Zion Hebron Gospel Songs
పల్లవి: యేసుని స్వీకరించు – క్రీస్తేసుని స్వీకరించు
నీ హృదయపు ద్వారము తెరువుము
త్వరితము తానే ప్రవేశించును
1. కనికరమందైశ్వరుండు – నిను – వాత్సల్యముతో విమోచించును
భయంకరమైన పాపమునుండి – విడిపింప నిన్ను వెదకివచ్చెన్
2. మన్నించు సర్వ పాపములన్ – తానే మాన్పును సర్వరోగములన్
కృప కనికరముల మకుటము నీకు – ధరియింప జేసి ఘనపరచున్
3. అంధులకు దృష్టి కలుగజేసె – అంగ హీనులను లేపి నడువజేసెన్
పలు విధములగు వ్యాధి గ్రస్తులకు – స్వస్థత నిచ్చెను తక్షణమే
4. పాపపు భారము భరియించెను – నీ రోగములన్నిటి తొలగించన్
సహించెను కొరడా దెబ్బల బాధను – జయించెను అన్ని శోధనలన్
5. కలువరి సిలువలో ప్రేలాడి – తన రక్తము చిందించె ధారలుగ
చేతులలో తన కాళ్ళలో చీలలు – ముండ్ల కిరీటము ధరియించె
6. జీవమిచ్చుటకు ప్రాణమిడె – మరి జయించెను ప్రతివిధ శోధనలు
నీ కొరకై మరణించి లేచెను – శక్తిమంతుడే నిను రక్షింప
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."